పల్లవి ప్రశాంత్‌ వారికి గూబ గుయ్‌మనేలా ఆన్సర్‌ ఇచ్చాడు.. అఖిల్ ఆసక్తికర పోస్ట్

by Disha Web Desk 6 |
పల్లవి ప్రశాంత్‌ వారికి గూబ గుయ్‌మనేలా ఆన్సర్‌ ఇచ్చాడు..  అఖిల్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ షో నాలుగో వారం హోరాహోరిగా సాగుతోంది. ఈ రియాలిటీ షో నాలుగో వారం వీకెండ్‌కు చేరుకుంది. ఇందులో నాలుగో పవరాస్త్ర కోసం పోటీ జరగ్గా అందులో పల్లవి ప్రశాంత్‌ కూడా నాలుగో ఇంటి సభ్యుడయ్యాడు. ఇందుకోసం బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్కులన్నింటిలోనూ ఆధిపత్యం చెలాయించాడు రైతు బిడ్డ. తోటి కంటెస్టెంట్ల దిమ్మ తిరిగే షాక్‌ ఇస్తూ పవరాస్త్రను సొంతం చేసుకున్నాడు. దీని కారణంగా పల్లవి ప్రశాంత్‌కు రెండు వారాల పాటు ఇమ్యూనిటీ లభించనుంది. అలాగే హౌజ్‌లో అతనిని ఎవరూ నామినేట్‌ చేసే అవకాశం లేదు. తాజాగా, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ సార్ధక్ రైతు బిడ్డపై ప్రశంసలు కురిపించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ కూడా షేర్ చేశాడు. ‘‘ ఎంత టార్గెట్ చేసినా చివరకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ హౌస్‌మేట్ అయ్యాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. తనను కిందకి లాగాలని చూసిన వారికి తన ఆటతీరుతో గూబ గుయ్‌మనేలా పల్లవి ప్రశాంత్ సమాధానం ఇచ్చాడు. జై జవాన్ జై కిసాన్’’ అని రాసుకొచ్చాడు.




Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed