- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్‌బాస్ సీజన్-7లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అబ్బాస్, పృథ్వీరాజ్..!
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్ బాస్ సీజన్ -7 ఉల్టా పల్టా అంటూ సరికొత్తగా అభిమానులను అలరిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్ బాస్ సీజన్ -7 ఉల్టా పల్టా అంటూ సరికొత్తగా అభిమానులను అలరిస్తోంది. మొన్నటివరకు ఆడియన్స్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం అట్టహాసంగా సాగుతోంది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. అయితే కమల్ హాసన్ హోస్ట్‌గా చేస్తోన్న తమిళ బిగ్ బాస్ సీజన్-7 కు సంబంధించి తాజాగా అప్డేట్ రానే వచ్చేసింది. ఇక హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల లిస్ట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ఈసారి బబ్లూ పృథ్వీ రాజ్, అబ్బాస్, వనితా విజయ్ కుమార్ కూతురు జోవిక విజయ్ కుమార్ పాల్గొననున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే రవీనా దాహా, నివిషా, అనన్య రావు, మాయా కృష్ణన్, రంజిత్, బావ చెల్లదురై, కూల్ సురేష్, వాసుదేవన్, విష్ణు విజయ్, విచిత్ర, విక్రమ్, ప్రదీప్ ఆంటోనీ తమిళ్ బిగ్ బాస్ సీజన్-7లో సెలక్ట్ అయ్యారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే ఈ సీజన్ ప్రారంభం వరకు ఎదురుచూడాల్సిందే.






