- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: తెలుగు బుల్లితెర పై బాగా పాపులర్ అయిన బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ -4సీజన్ కు రంగం సిద్ధం అయ్యింది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామేర సినిమాలు, సీరియన్లు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ -4పై నీలినీడలు కమ్ముకున్నాయి.
అసలు ఈసారి సీజన్ ఉంటుందా లేదా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ జరిగితే దానికి హోస్ట్‌గా ఎవరు వ్యవహరించనున్నారు. అందులోని పాత్రధారులు కొత్తగా ఎవరెవరినీ తీసుకోనున్నారు.. అనే ప్రశ్నలు అభిమానులకు గందరగోళానికి గురిచేశాయి.
ఫైనల్‌గా ఆ సందేహాలకు స్టార్ మా పులిస్టాప్ పెట్టింది. సీజన్ గురించి ప్రకటించడమే కాకుండా హోస్ట్‌గా నాగార్జునను తీసుకున్నట్లు ప్రకటించారు. తాజాగా దానికి సంబంధించి మరో వీడియో బుధవారం రిలీజ్ చేసింది స్టార్ మా. అందులో నాగార్జున ఓ వృద్ధుడి వేషంలో కనిపించారు. దీనిని చానల్ యాజమాన్యం సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత ఎం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్డ్ అంటూ యాజమాన్యం ట్వీట్ చేసింది.