- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేము చేస్తే బూతు.. స్టార్ కిడ్స్ చేస్తే హాట్.. ఇదెక్కడి న్యాయం?
<p>దిశ, సినిమా : టీవీ సెలబ్రిటీస్, బాలీవుడ్ మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో బాలీవుడ్‌కు గొప్ప పేరు ఉండగా.. టెలివిజన్ స్టార్లకు ఇక్కడ పెద్దగా ప్రోత్సాహం లభించదనే చెప్పాలి. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ OTT కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్.. తాజాగా తను ధరించిన దుస్తుల పట్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది. అందుకు సంబంధించిన రెండు సంఘటనలను స్టార్ కిడ్స్ విషయంలో పోల్చి చూపిస్తూ జనాల ద్వంద్వ వైఖరిని […]</p>

దిశ, సినిమా : టీవీ సెలబ్రిటీస్, బాలీవుడ్ మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో బాలీవుడ్‌కు గొప్ప పేరు ఉండగా.. టెలివిజన్ స్టార్లకు ఇక్కడ పెద్దగా ప్రోత్సాహం లభించదనే చెప్పాలి. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ OTT కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్.. తాజాగా తను ధరించిన దుస్తుల పట్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది. అందుకు సంబంధించిన రెండు సంఘటనలను స్టార్ కిడ్స్ విషయంలో పోల్చి చూపిస్తూ జనాల ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపింది.

ఈ మేరకు సోషల్ మీడియాలో రెండు స్క్రీన్‌షాట్స్ షేర్ చేసిన ఉర్ఫీ.. మొదటి పిక్చర్‌లో స్టార్ కిడ్ బికినీ ధరిస్తే మీడియా పోర్టల్ తనను హాట్ అని వర్ణించిందని, రెండో పిక్చర్‌లో తను బికినీ ధరిస్తే మాత్రం స్కిన్ షో అంటూ కామెంట్స్ చేసిందని వెల్లడించింది. ఈ పక్షపాత ధోరణి ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతోందని, అయితే ఇలాంటి ట్రోల్స్ వల్ల తను మరింత స్ట్రాంగ్‌గా మారుతానని తెలిపింది.






