BIGGBOSS-5 ఆఫీషియల్ ప్రోమో రిలీజ్.. ప్రారంభం ఎప్పుడంటే.?

by  |
BIGGBOSS-5 ఆఫీషియల్ ప్రోమో రిలీజ్.. ప్రారంభం ఎప్పుడంటే.?
X

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్‌బాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ మేరకు స్టార్ మా యాజమాన్యం ఓ ప్రోమో వీడియోను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 5 నుంచి స్టార్‌ మాలో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రసారం కానుంది.

సెప్టెంబర్‌ 5న సాయంత్రం 6 గంటలకు ఐదో సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభమవనుంది. తర్వాత సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు షో ప్రసారం కానుంది. అయితే ప్రతీ సీజన్‌లో మాదిరిగానే ఈసారి కూడా హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోషల్‌ మీడియాలో ఓ లిస్ట్‌ చక్కర్లు కొడుతోంది.

ఆ లిస్టు ప్రకారం.. యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేత, యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, నటి లహరి, నవ్య స్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో,సిరి హన్మంత్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

అయితే త్వరలోనే ఈ షోలో పాల్గొనబోయే సభ్యుల వివరాలు స్టార్ మా యాజమాన్యం తెలియజేయనున్నారు. అయితే, ఈసారి కూడా బిగ్‌బాస్ హోస్ట్‌గా కింగ్‌ నాగార్జుననే వ్యవహరించనున్నాడు.


Next Story

Most Viewed