శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహిస్తాం: భూపాల్ రెడ్డి

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 24 తేదీ నుండి జరగబోయే శాసన మండలి సమావేశాలను విజయవంతంగా నిర్వహిస్తామని శాసనమండలి ప్రొటెం చైర్మన్ గోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. సభను విజయవంతంగా నడపాలంటే శాసన మండలి సభ్యుల సహకారం కావాలని,.అందరూ తప్పకుండా సహకరించాలని కోరారు. సభ, సమావేశాల్లో అందరికి మాట్లాడే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను మన తెలంగాణ ప్రభుత్వం అమలు [&hellip;]</p>

శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహిస్తాం: భూపాల్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 24 తేదీ నుండి జరగబోయే శాసన మండలి సమావేశాలను విజయవంతంగా నిర్వహిస్తామని శాసనమండలి ప్రొటెం చైర్మన్ గోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. సభను విజయవంతంగా నడపాలంటే శాసన మండలి సభ్యుల సహకారం కావాలని,.అందరూ తప్పకుండా సహకరించాలని కోరారు. సభ, సమావేశాల్లో అందరికి మాట్లాడే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను మన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దక్షతతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందంజలో ఉందన్నారు. శాసన మండలి సభ్యునిగా ఉన్న తనకు శాసనమండలి ప్రొటెం చైర్మన్ గా పని చేసే గొప్ప అవకాశాన్ని కేసీఆర్ కల్పించారన్నారు.. తనకు ఇచ్చిన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానన్నారు.

Next Story