- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను అడ్డుకోవడం కాదు.. వాటిపై కాస్త శ్రద్ధ పెట్టండి: అఖిల ప్రియ
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా పరిషత్ ఎన్నికల్లో బాచేపల్లి వైసీపీ పోలింగ్ ఏజెంట్‌గా ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తిని ఎలా నియమిస్తారని అఖిల ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బాచేపల్లి బయల్దేరిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అఖిల ప్రియ మాట్లాడుతూ.. వైసీపీ నేతలు తనను అడ్డుకోవడం పక్కనబెట్టి.. అభిృవృద్ధిపై శ్రద్ధ చూపాలన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా ఓట్లు వేయించుకుంటోందని ఆమె ఆరోపించారు. ఈ ఎన్నికలను పార్టీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా పరిషత్ ఎన్నికల్లో బాచేపల్లి వైసీపీ పోలింగ్ ఏజెంట్‌గా ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తిని ఎలా నియమిస్తారని అఖిల ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బాచేపల్లి బయల్దేరిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అఖిల ప్రియ మాట్లాడుతూ.. వైసీపీ నేతలు తనను అడ్డుకోవడం పక్కనబెట్టి.. అభిృవృద్ధిపై శ్రద్ధ చూపాలన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా ఓట్లు వేయించుకుంటోందని ఆమె ఆరోపించారు. ఈ ఎన్నికలను పార్టీ బహిష్కరించినప్పటికీ తాము పోటీ చేశామని చెప్పుకొచ్చారు. టీడీపీని భయపెట్టాలని చూస్తే అందుకు రెట్టింపుగా స్పందిస్తామని.. త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని అఖిల ప్రియ వార్నింగ్ ఇచ్చారు.
Next Story






