ఇండియన్ మిలిటరీ గ్రేటెస్ట్ విక్టరీ.. ‘భుజ్’ ట్రైలర్ అవుట్

by  |
BHUJ-Trailer
X

దిశ, సినిమా : అజయ్ దేవ్‌గన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా వంటి భారీ కాస్టింగ్‌తో తెరకెక్కిన చిత్రం ‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ ట్రైలర్ రిలీజైంది. ఇటీవలే టీజర్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అజయ్ దేవ్‌గన్.. ట్రైలర్ రిలీజ్ గురించి ప్రకటించగా ఫైనల్‌గా ఈ రోజు విడుదల చేశారు మేకర్స్. 1971 సంవత్సరం గుజరాత్‌లోని భుజ్ ప్రాంతాన్ని చూపిస్తూ ట్రైలర్ మొదలవగా.. ఇండియన్ హిస్టరీ గ్రేటెస్ట్ బాటిల్స్‌లో ఒకటైన 1971 ఇండో-పాక్ యుద్ధంపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ వార్‌లో భుజ్ వద్ద గల IAF ఎయిర్‌స్ట్రిప్ ధ్వంసం కాగా.. 300 మంది స్థానిక మహిళల సాయంతో ఎయిర్‌బేస్‌ను రీకన్‌స్ట్రక్ట్ చేసేందుకు ప్రయత్నించే IAF స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్‌‌గా అజయ్ దేవ్‌గన్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఇక సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, అమ్మీ విర్క్‌తో పాటు నోరా ఫతేహి, షారద్ కెల్కర్‌లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

ఈ ట్రైలర్ వీడియోకు డిస్క్రిప్షన్ యాడ్ చేసిన మేకర్స్.. ‘ధైర్యం మీ కవచంగా మారినప్పుడు, ప్రతీ అడుగు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది! ఇప్పటి వరకు తెరపై ఆవిష్కరించని గ్రేటెస్ట్ వార్ గురించి తెలుసుకోండి. భారతదేశ గొప్ప సైనిక విజయాల్లో ఒకటైన ఇండో-పాక్ యుద్ధానికి సంబంధించిన ఇంపార్టెంట్ చాప్టర్‌ను #BhujThePrideOfIndiaతో డిస్నీ + హాట్‌స్టార్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం’ అని ప్రకటించారు. టీ-సిరీస్, అజయ్ దేవ్‌గన్ ఎఫ్ ఫిలిమ్స్ సమర్పణలో భూషణ్ కుమార్ అండ్ పార్టనర్స్ ఈ సినిమాను నిర్మించగా.. అభిషేక్ దుడియా దర్శకత్వం వహించారు. కాగా ఈ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ఆగస్టు 13న డీస్నీ+హాట్‌స్టార్ వీఐపీలో రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉంది.



Next Story

Most Viewed