బాలీవుడ్‌కు 'భీష్మ'… హీరోగా రణ్‌బీర్

by  |
బాలీవుడ్‌కు భీష్మ… హీరోగా రణ్‌బీర్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్… ఇప్పుడు రీమేక్ వుడ్ అయిపోతుంది. సౌత్ ఇండస్ట్రీలో ఒక సినిమా స్పెషల్‌గా కనిపించిందంటే చాలు రీమేక్ చేస్తున్నారు అక్కడి ఫిల్మ్ మేకర్స్, హీరోస్. ఈ మధ్య స్టార్ రేంజ్‌తో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకాదరణ పెరుగుతుండడం.. దక్షిణాది పరిశ్రమలో అలాంటి సినిమాలే వస్తుండడంతో.. రీమేక్ చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. అలా వచ్చిందే.. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయిపోగా….. ఈ సినిమాను రీమేక్ చేసిన షాహిద్ కపూర్ ఫ్యాన్ పాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే మళ్లీ తెలుగు సినిమా రీమేక్‌నే తన తర్వాతి చిత్రంగా ఎన్నుకున్నాడు షాహిద్. నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ రెండు సినిమాలకు ఒరిజినల్ తెలుగు డైరెక్టర్సే హిందీలోనూ దర్శకత్వం వహించాలని కోరారు షాహిద్. ఇక తమిళ్ హీరో కార్తి నటించిన ‘కైథీ’ సినిమా హక్కుల కోసం భారీ కాంపిటీషనే నడిచింది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ముందుకు రాగా.. అజయ్ దేవగన్ కార్తి పాత్రలో నటిస్తూ… సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో పాటు సూర్య కొత్త చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’, ‘ఆర్ఎక్స్ 100’ చిత్రాలపై కూడా బాలీవుడ్ కన్నుపడింది.

ఇదిలా ఉంటే బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ కూడా ఓ తెలుగు సినిమాను రీమేక్ చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. తాజాగా నితిన్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ సినిమాను బాలీవుడ్ పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట రణ్ బీర్. యువతను ఆకట్టుకున్న ఈ సినిమాను హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించేందుకు ఇంట్రెస్త్ చూపుతున్నాడట ఫిల్మ్ మేకర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. నితిన్ కెరియర్‌లోనే భారీ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రానికి బాలీవుడ్‌లో రణ్ బీర్ స్టార్ రేంజ్ యాడ్ అయితే నిర్మాతకు కాసుల వర్షం కురవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.



Next Story

Most Viewed