- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ ‘భీమ్లా నాయక్’ సింగర్‌కు ఘన సత్కారం..
by Shyam |
<p>దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: ప్రముఖ కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యను తుర్కయంజాల్ కౌన్సిల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కొశికె ఐలయ్య ఘనంగా సత్కరించారు. బుధవారం తన ఆఫీసుకు వచ్చిన మొగులయ్యకు మద్దిమడుగు పీఠాధిపతి జయరాం గురుస్వామితో కలిసి శాలువా కప్పి సన్మానించారు. అలాగే కొంత ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ మొగులయ్యకు ఉన్న అరుదైన కళ బతకాలని ఆకాంక్షించారు. పేద కళాకారులను, కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘మొగులయ్య’ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ […]</p>

X
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: ప్రముఖ కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యను తుర్కయంజాల్ కౌన్సిల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కొశికె ఐలయ్య ఘనంగా సత్కరించారు. బుధవారం తన ఆఫీసుకు వచ్చిన మొగులయ్యకు మద్దిమడుగు పీఠాధిపతి జయరాం గురుస్వామితో కలిసి శాలువా కప్పి సన్మానించారు. అలాగే కొంత ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ మొగులయ్యకు ఉన్న అరుదైన కళ బతకాలని ఆకాంక్షించారు. పేద కళాకారులను, కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘మొగులయ్య’ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ మూవీలో ‘టైటిల్ సాంగ్’ పాడిన విషయం తెలిసిందే. ఈ ఒక్క పాటతో ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయారు.
Next Story






