ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ

by Mallepaka Hamsa |

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ప్రారంభమైంది. కనకదుర్గ గుడి సన్నిధిలో మంగళవారం ఉదయం 6:37 గంటలకు దుర్గ గుడి స్థానాచార్యులు, ఆలయ అధికారులు మూడు హోమ గుండాలకు అగ్ని ప్రతిష్టాపన చేశారు. కాగా, అమ్మవారి నేతి టెంకాయలను వేసేందుకు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ఇరుముడి బియ్యం వేసేందుకు 20 కౌంటర్లను ఏర్పాటు చేశారు. భవానీ దీక్ష విరమణకు భవానీలు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటల సమయం [&hellip;]</p>

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ప్రారంభమైంది. కనకదుర్గ గుడి సన్నిధిలో మంగళవారం ఉదయం 6:37 గంటలకు దుర్గ గుడి స్థానాచార్యులు, ఆలయ అధికారులు మూడు హోమ గుండాలకు అగ్ని ప్రతిష్టాపన చేశారు.

కాగా, అమ్మవారి నేతి టెంకాయలను వేసేందుకు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ఇరుముడి బియ్యం వేసేందుకు 20 కౌంటర్లను ఏర్పాటు చేశారు. భవానీ దీక్ష విరమణకు భవానీలు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటల సమయం నుండి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు.

Next Story