‘బెల్’లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

by  |
‘బెల్’లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులోని న‌వ‌ర‌త్న కంపెనీ అయిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) సంస్థకు చెందిన ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌లో కింది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య : 53
పోస్టు పేరు : ‌ప్రాజెక్ట్ ఇంజినీర్-1
మొత్తం ఖాళీలు : 20
అర్హత : ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్/బీఎస్సీ చేసిన వారితోపాటు ఎల‌క్ట్రో ఆప్టిక్స్‌ లేదా ఫొటోనిక్స్‌ విభాగాల్లో ఎమ్మెస్సీ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. రెండేళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి
పోస్టు పేరు : ట్రైనీ ఇంజినీర్-1
మొత్తం ఖాళీలు : 33
అర్హత : ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెక‌ట్రానిక్స్‌ తదితర సబ్జెక్టుల్లో బీటెక్ లేదా బీఎస్సీ చేసిన వారు అర్హులు. కనీసం ఆరు నెలలపాటు పనిచేసిన అనుభవం ఉండాలి
పే స్కేల్‌ : నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్లకు రూ.50వేలు, ట్రైనీ ఇంజినీర్లకు రూ.31వేలు
వ‌య‌స్సు : 1, జ‌న‌వ‌రి 2021 నాటికి 28 ఏండ్లు (ట్రైనీ ఇంజినీర్‌కు 25ఏండ్లు) మించ‌రాదు.
అప్లికేష‌న్ ఫీజు : ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రూ.200, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రూ.500. ఎస్సీ/ఎస్టీ & పీహెచ్‌సీ అభ్యర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.
ద‌ర‌ఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివ‌రి తేదీ : 17 ఫిబ్రవరి, 2021.
వెబ్‌సైట్‌ : www.bel-india.in



Next Story

Most Viewed