‘తలైవి’ జీవితాన్ని మలుపుతిప్పే భాగ్యశ్రీ..

by  |
‘తలైవి’ జీవితాన్ని మలుపుతిప్పే భాగ్యశ్రీ..
X

మైనే ప్యార్ కియా సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిన్నటి తరం హీరోయిన్ భాగ్య శ్రీ.. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లోనూ నటించింది. చాలాకాలం తర్వాత మళ్లీ మేకప్ వేసుకున్న ఆమె.. ప్రభాస్‌కు తల్లిగా ఓ చిత్రంలో నటిస్తున్నట్టు ఇటీవలే చెప్పింది. బాహుబలికి తల్లిగా నటించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది.

అయితే కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న ‘తలైవి’ సినిమాలోనూ తను కీలకపాత్ర చేస్తోందట. జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నఈ సినిమాలో తను చేస్తున్న క్యారెక్టర్.. తలైవి జీవితాన్ని మలుపుతిప్పే మంచి క్యారెక్టర్‌ అని చెప్పింది. కంగనాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని.. మా ఇద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ మూవీ యూనిట్‌కు చాలా నచ్చిందని చెప్పింది. కంగనా ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అని.. తన పాత్ర కోసం 100 శాతం కష్టపడే నటి అని ప్రశంసించింది. చాలా కాలం తర్వాత సెట్స్‌కి వెళ్లడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపింది భాగ్య శ్రీ.

కాగా, భాగ్యశ్రీ ఇదే వరుసలో మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేసిందట. ‘మరిన్ని స్క్రిప్ట్‌లు కూడా చదువుతున్నానని.. త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తాను’ తెలిపింది.

Next Story

Most Viewed