భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎంతంటే

by  |
భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎంతంటే
X

దిశ, భద్రాచలం : భద్రాద్రి రామయ్యకు భక్తులు ఇచ్చే కానుకలే ప్రధాన ఆదాయం. కానుకల రూపంలో వచ్చే ఆదాయంతోనే ఆలయ ఆలన పాలన చూస్తారు. ఐదు నెలల తర్వాత భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో హుండీ ఆదాయాన్ని అధికారులు సోమవారం లెక్కించారు. హుండీ ద్వారా రూ 66,51,895 నగదు, బంగారం 80 గ్రాములు, వెండి 1 కేజీ 200 గ్రా. యుఎస్ డాలర్ 83, ఇండోనేషియా రూపాయ 1000, యుఏఈ దిర్హమ్స్170, సింగపూర్ డాలర్లు 7, ఒమాన్ రియాల్స్ 100 వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. 152 రోజుల ఆదాయాన్ని లెక్కించినట్లు వెల్లడించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 5న హుండీ లెక్కింపు ద్వారా రూ 71,74,980 ఆదాయం రాగా, మార్చి 4న లెక్కింపు ద్వారా 51,76,287 లభించగా, జూన్ 10న హుండీ ద్వారా రూ 27,08,546 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం లెక్కింపు సమయంలో భద్రత, కరోనా నిబంధనలు పాటించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా భద్రాద్రి రామయ్య ఆలయంపై కరోనా ఎఫెక్ట్ పడింది. ప్రభుత్వ ఆదేశానుసారం మార్చి 17న ఆలయంలో ఆర్థిక సేవలు నిలిపివేయగా, మార్చి 22 నుంచి ఆలయ దర్శనాలు బంద్ అయ్యాయి. జూన్ 8న తిరిగి ఆలయ దర్శనాలు, అక్టోబర్ 5 నుంచి ఆర్జితసేవలు పునఃప్రారంభమయ్యాయి.


Next Story

Most Viewed