- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అరెస్ట్
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జలదీక్షలో పాల్గొనేందుకు వెళుతున్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకివెళితే..ఖమ్మం జిల్లా పాలేరు జలాశయం వద్ద సీఎల్పీ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు జలదీక్ష చేపట్టారు.ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే వీరయ్య తన క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరారు.విషయం తెలుసుకున్నపోలీసులు మార్గమధ్యలోనే భద్రాచలంలోని […]</p>

X
దిశ, ఖమ్మం: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జలదీక్షలో పాల్గొనేందుకు వెళుతున్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకివెళితే..ఖమ్మం జిల్లా పాలేరు జలాశయం వద్ద సీఎల్పీ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు జలదీక్ష చేపట్టారు.ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే వీరయ్య తన క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరారు.విషయం తెలుసుకున్నపోలీసులు మార్గమధ్యలోనే భద్రాచలంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే, అతని అనుచరులను అరెస్టు చేసి పీఎస్‌కు స్టేషన్‌కు తరలించారు. అనంతరం కొద్దిసేపటికి వారిని వదిలివేశారు.
Next Story






