ఫోన్లో మాట్లాడినా కరోనా వస్తుందంటా.. జాగ్రత్త?

by  |
ఫోన్లో మాట్లాడినా కరోనా వస్తుందంటా.. జాగ్రత్త?
X

దిశ,ఇబ్రహీంపట్నం: మీరు ఫోన్ వాడుతున్నారా.. ఐతే ఈ రోజు నుండి జాగ్రత్త సుమా.. మీకు ఫోన్ చేసేవారి పరిస్థితిని తెలుసుకోని ఫోన్ మాట్లాడండి. ఒక వేళ మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తికి కరోనా వచ్చిందంటే ఆ వ్యక్తితో ఫోన్ మాట్లాడినందుకు మీక్కూడ వస్తుందంటా తెలుసా…? ఇంతకీ విషయం ఏంటాని అనుకుంటున్నరా..? పూర్తిగా చదవండి మీకే తెలుస్తోంది.

రంగారెడ్డి మంచాల మండలం దాద్‌పల్లి గ్రామంలో ఏడు రోజుల క్రితం కరోనా సోకిన వ్యక్తి తన ఇంటి చుట్టుపక్కల శానిటైజేషన్ చేయించి, తనకు కావలసిన సౌకర్యాలు కల్పించాలని సర్పంచ్‌కు ఫోన్ చేశాడు. అయితే ఫోన్ ఎత్తిన సర్పంచ్ భర్త చందునాయక్ ‘ఫోన్ మాట్లాడితే కరోనా వస్తుందంటు’ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఇదే ఆడియో రికార్డు నియోజకవర్గం వాట్సాప్ గ్రూప్‌ల్లో ట్రోల్ అవుతుంది.


Next Story

Most Viewed