ఓ వైపు ఫలితాలు.. మరోవైపు బెట్టింగ్

by Shyam |

<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఓ వైపు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా.. మరోవైపు బెట్టింగ్ జోరుగా సాగుతోంది. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు ప్రచారం సాగించాయి. ఈ నెల1న పోలింగ్ ముగియడంతో అభ్య ర్థులు అంచనాల్లో తలమునుకలయ్యా రు. గ్రేటర్​లో నమోదైన పోలింగ్ శాతం అందరినీ కలవరపెడుతోంది. దీనిపై నగరంలోని పలు డివిజన్లలో ప్రజలు జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలను బహిర్గతం కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. నగరం [&hellip;]</p>

ఓ వైపు ఫలితాలు.. మరోవైపు బెట్టింగ్
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఓ వైపు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా.. మరోవైపు బెట్టింగ్ జోరుగా సాగుతోంది. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు ప్రచారం సాగించాయి. ఈ నెల1న పోలింగ్ ముగియడంతో అభ్య ర్థులు అంచనాల్లో తలమునుకలయ్యా రు. గ్రేటర్​లో నమోదైన పోలింగ్ శాతం అందరినీ కలవరపెడుతోంది. దీనిపై నగరంలోని పలు డివిజన్లలో ప్రజలు జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలను బహిర్గతం కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. నగరం నడిబొడ్డులోని స్టార్ ​హోటళ్లు, క్లబ్‎ల్లో ఉన్నతస్థాయి వ్యక్తులు బెట్టింగ్ కాస్తున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్, బీజేపీపైనే కాకుండా టీడీపీ, వామపక్ష పార్టీలకు ఓట్లు భారీగానే వచ్చే అవకాశం ఉందనే అంశంపై బెట్టింగ్ లు నడిచినట్లు తెలుస్తోంది.

రూ.లక్షల్లో బెట్టింగ్..

గ్రేటర్ ఎన్నికలపై బెట్టింగ్‎లు నగరంలో జోరుగా సాగుతున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు రూ.లక్షల్లో బెట్టింగ్ కాస్తుండగా మధ్యతరగతి కుటుంబాలు సైతం వాళ్ల స్థాయిలో బెట్టింగ్​ కాస్తున్నట్లు సమాచారం. శివారులోని డివిజన్‎లో టీఆర్ఎస్‎పై, కోర్ సిటీలో బీజేపీపై పందాలు కాస్తున్నారు. పాత బస్తీలో సైతం బెట్టింగ్ జోరుగా సాగినట్లు తెలిసింది.

ఏ పార్టీకి లాభిస్తుందో ..?

గ్రేటర్ ఎన్నికల కోసం పది రోజులుగా పోరాటం చేసిన రాజకీయ పార్టీల అభ్యర్థుల భవిత్యం నేటితో తేలనుంది. అలాగే, పార్టీల పై బెట్టింగ్ కాసిన అభిమానులకు లాభామో, నష్టమో తెలిసిపోతుంది. దీంతో బెట్టింగ్ రాజాల గుండెల్లో గుబులు మొదలైంది. పందెం నెగ్గుతుందా లేదా అని అంచనాలు వేసుకుంటున్నారు. బెట్టింగ్ నగదు ఇప్పటికే మధ్యవర్తుల వద్ద ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ నియోజకవర్గంలోనే..

శివారు నియోజకవర్గాలైన ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్‎లో టీఆర్​ఎస్‎పై బెట్టింగ్ నడవగా, అంబర్​పేట్, మల్కాజిగిరి, సనత్ నగర్, గోషామహల్, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని డివిజన్లలో బీజేపీపై బెట్టింగ్ భారీ స్థాయిలో జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

Next Story