#BetheREALMAN చాలెంజ్… సుక్కు, కీరవాణి టాస్క్ పూర్తి

by  |
#BetheREALMAN చాలెంజ్… సుక్కు, కీరవాణి టాస్క్ పూర్తి
X

#BetheREALMAN చాలెంజ్… దర్శకుడు సందీప్ వంగా ప్రారంభించాడు. నిజమైన పురుషుడు కాలు మీద కాలేసుకుని టైమ్ పాస్ చేసే వాడు కాదు… మహిళలకు సహాయపడుతూ సపోర్ట్ చేసేవాడు… అది ఇంటి పనే కావచ్చు… వంట పని కావచ్చు… నిజానికి అలాంటివాడే మగ మహారాజు అనే ఉద్దేశ్యంతో ఈ చాలెంజ్ స్టార్ట్ చేశాడు. తర్వాత రాజమౌళికి చాలెంజ్ విసరగా… తను టాస్క్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి … తారక్, చరణ్, సుకుమార్, కీరవాణి లను నామినేట్ చేశాడు. వీరిలో తారక్, చెర్రీ సోమవారమే టాస్క్ పూర్తి చేసి రియల్ మెన్ అనిపించుకోగా… సుక్కు, కీరవాణి మంగళవారం చాలెంజ్ కంప్లీట్ చేశారు.

#betheREALMAN చాలెంజ్ లో భాగంగా సుకుమార్.. ఇళ్లు ఊడ్చి, శుభ్రంగా తుడిచాడు. ఆ తర్వాత బోళ్లు తోమి కడిగి భార్యచే శభాష్ అనిపించుకున్న వీడియో సెండ్ చేశాడు. కాగా ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో రంగస్థలం సినిమా నుంచి ఎంత సక్కగున్నవే సాంగ్ మ్యూజిక్ హైలెట్. కాగా టాస్క్ పూర్తి చేసిన సుక్కు… DSP, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, సురేందర్ రెడ్డి, దిల్ రాజులను నామినేట్ చేశాడు.

అప్పుడప్పుడు #betheREALMAN లా ఉండాలని చెప్తున్నారు కీరవాణి. తమ్ముడు జక్కన్న చాలెంజ్ ను స్వీకరించిన ఆయన… వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతికి, ఆరేసి… ఆ తర్వాత బట్టలు మడతపెట్టి కబ్ బోర్డులో నీట్ గా సర్ది పెట్టారు. ఆ తర్వాత మొక్కలకు నీరు పోసి… హాల్ లో టేబుల్ శుభ్రం చేయడం ద్వారా టాస్క్ పూర్తి చేశారు. చూస్తుంటే ఈ చాలెంజ్ కరోనా వైరస్ మాదిరిగా ఒకరి నుంచి ఒకరికి ప్రసారం అవుతుందన్నారు కీరవాణి. రాజమౌళి నుంచి నాకు… నా నుంచి ఇతరులకు అంటూ… దర్శకుడు క్రిష్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను నామినేట్ చేశారు.




Next Story