యూట్యూబ్‌లో ‘బేషరమ్’ రికార్డ్స్

by  |
యూట్యూబ్‌లో ‘బేషరమ్’ రికార్డ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బ్రేకప్ తర్వాత.. మళ్లీ ఓ ప్రేమ కథ మొదలవుతుంది’ అనే కాన్సెప్ట్‌తో బాలీవుడ్ బ్యూటీ దివ్యా ఖోస్లా కుమార్ ఫిమేల్ లీడ్‌లో తెరకెక్కిన ‘బేషరమ్ బేవఫా’ సింగిల్.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. సోమవారం యూట్యూబ్‌లో రిలీజై సాంగ్.. కొద్ది గంటల్లోనే 20 వేల మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. యూట్యూబ్ చార్ట్స్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతున్న ఈ సింగిల్‌లో సిద్ధార్థ్ గుప్తా, గౌతమ్ గులాటి నటించగా.. గ్రేట్ మ్యూజిక్, హార్డ్ హిట్టింగ్ పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది.

‘యాద్ పియా కి, తేరి ఆంఖో మే’ తర్వాత ‘బేషరమ్ బేవఫా’ సింగిల్‌తో హ్యాట్రిక్ అందుకున్న దివ్యా ఖోస్లా.. ఇండిపెండెంట్ మ్యూజిక్ స్పేస్‌లో బెంచ్ మార్క్ సెట్ చేసింది. ప్రియుడి చేతిలో మోసపోయిన యంగ్ గర్ల్‌గా బాధ, నొప్పి, వేదనను బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేసి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన దివ్య.. ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో తనలో మరో యాంగిల్‌ను చూపించిందంటున్నారు అభిమానులు. తన ఆల్బమ్స్ అన్నీ కూడా యూత్‌ రిలేటెడ్‌గా ఉండడంతో ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 30న రిలీజైన ‘బేషరమ్ బేవఫా’ రికార్డ్ బ్రేకింగ్ సింగిల్‌గా నిలిచింది. టీ సిరీస్ బ్యానర్ నిర్మించిన పాటను బి ప్రాక్ పాడగా జాని కంపోజ్ చేశారు.



Next Story

Most Viewed