అభిమానిని తోసేసిన హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్.. వీడియో వైరల్

by  |
అభిమానిని తోసేసిన హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్స్ జెన్నీఫర్ లోపేజ్.. బెన్ అఫ్లెక్‌తో రిలేషన్‌షిప్‌పై పుట్టినరోజునే క్లారిటీ ఇచ్చేసింది. దీంతో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్న కపుల్స్.. తాజాగా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో‌ జంటగా ఎంటరై రెడ్ కార్పెట్‌ డెబ్యూ ఇచ్చారు. ఇప్పటి వరకు బాగానే ఉన్న ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక వెనిస్ ఎయిర్‌పోర్టు చేరుకున్న జెన్నీఫర్, బెన్ అఫ్లిక్‌కు కాస్త ఇబ్బందికర సంఘటన ఎదురైంది. మాస్క్ కూడా ధరించని ఓ అభిమాని జెన్నీఫర్‌తో క్లోజ్‌గా సెల్ఫీ తీసుకునేందుకు ట్రై చేశాడు. దీంతో వెంటనే అతన్ని బెన్ అఫ్లెక్ నెట్టేయగా.. సేఫ్‌గా తన వెనుకకు వచ్చేసింది జెన్నీఫర్. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ టీమ్ సిచ్యువేషన్‌ను హ్యాండిల్ చేశారు. ఆ తర్వాత జెన్నీ అండ్ అఫ్లె్క్ చేతిలో చేయి వేసుకుని నడుస్తున్న వీడియో వైరల్ అయింది.



Next Story