ప్రైవేట్ ఉపాధ్యాయుల బిక్షాటన

98

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిష్కారం పోరాటం కొనసాతుందని, తమ సమస్యలను పరిష్కరించే వరకూ విశ్రమించేది లేదని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ అన్నారు. టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో మహబూబ్‌బాద్ మండలం నెల్లికుదురు మండలంలో శుక్రవారం బిక్షాటన చేశారు. లాక్‌డౌన్ ఇబ్బందులు, జీతాలు అందక ఆర్థిక కష్టాలతో పలువురు ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువయ్యిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విద్యావ్యవస్థలో మెజారిటీ విద్యార్థులకు ప్రైవేట్ టీచర్లే బోధిస్తున్నారని, వారి సమస్యలను సామాన్యుల దృష్టికి తీసుకెళ్లేందుకే బిక్షాటన చేస్తున్నట్టు తెలిపారు. ఈ బిక్షాటనలో టీపీటీఎఫ్ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.