ఎలుగుబంటి అటాక్.. తృటిలో తప్పించుకున్న రైతు

by Aamani |
ఎలుగుబంటి అటాక్.. తృటిలో తప్పించుకున్న రైతు
X

దిశ, ఆసిఫాబాద్ రూరల్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో ఎలుగుబంటి దాడి చేసిన ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. తన ఎద్దు కోసం గాలిస్తూ అడవిలోకి వెళ్లిన కనక చిన్ను అనే రైతుపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేయడంతో బాధితుడికి తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే అతన్ని ప్రథమ చికిత్స కోసం జైనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత రైతు ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story