- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబాయ్‌లో బీసీసీఐ తాత్కాలిక కార్యాలయం
<p>దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ రెండో దశ, టీ20 వరల్డ్ కప్‌లకు బీసీసీఐ యూఏఈలో ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అక్కడకు చేరుకున్నారు. దుబాయ్‌లో తాత్కాలికంగా బీసీసీఐ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఒమన్ వెళ్లిన గంగూలీ అటునుంచి నేరుగా దుబాయ్ చేరుకున్నారు. ఐపీఎల్ ఫేజ్ 2 ప్రారంభానికి రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయం నుంచి పనులు పర్యవేక్షించనున్నట్లు […]</p>

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ రెండో దశ, టీ20 వరల్డ్ కప్‌లకు బీసీసీఐ యూఏఈలో ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అక్కడకు చేరుకున్నారు. దుబాయ్‌లో తాత్కాలికంగా బీసీసీఐ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఒమన్ వెళ్లిన గంగూలీ అటునుంచి నేరుగా దుబాయ్ చేరుకున్నారు. ఐపీఎల్ ఫేజ్ 2 ప్రారంభానికి రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయం నుంచి పనులు పర్యవేక్షించనున్నట్లు తెలుస్తున్నది. ఇండియా నుంచి యూఏఈకి విమానాల రాకపోకలపై నిషేధం ఉన్న నేపథ్యంలో ప్రతీ సారి ప్రయాణానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అందుకే తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసినట్లు సమాచారం. జులై 21 తర్వాత విమానాల రాకపోకలపై నిషేధం ఎత్తివేస్తే ఆయా ఫ్రాంచైజీల ప్రతినిధులు కూడా యూఏఈ చేరుకొని లాజిస్టిక్స్ సంబంధిత కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉన్నది.






