- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిబ్రవరిలో ఐపీఎల్ మినీ ఆక్షన్ ?
<p>దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ రెండో వారం తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి రెండు కొత్త టీమ్స్ జత చేస్తారని వార్తలు వచ్చినా.. బీసీసీఐ 2022కు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ లోపు ఐపీఎల్ ఫ్రాంచైజీల డిమాండ్ మేరకు మినీ వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది. షెడ్యూల్ ప్రకారం 2020 సెప్టెంబర్‌లో ఐపీఎల్ మెగా వేలం జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సెప్టెంబర్-నవంబర్ […]</p>

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ రెండో వారం తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి రెండు కొత్త టీమ్స్ జత చేస్తారని వార్తలు వచ్చినా.. బీసీసీఐ 2022కు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ లోపు ఐపీఎల్ ఫ్రాంచైజీల డిమాండ్ మేరకు మినీ వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది. షెడ్యూల్ ప్రకారం 2020 సెప్టెంబర్‌లో ఐపీఎల్ మెగా వేలం జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సెప్టెంబర్-నవంబర్ మధ్య యూఏఈలో నిర్వహించారు. దీంతో మెగా వేలం పాటను రద్దు చేశారు. ఇవే జట్లను వచ్చే సీజన్ కూడా కొనసాగించాలి బీసీసీఐ నిర్ణయించింది. అయితే తమకు కొత్త ఆటగాళ్లు కావాలని.. మినీ వేలం నిర్వహించమంటూ ఫ్రాంచైజీలు డిమాండ్ చేశాయి. దీంతో ఫిబ్రవరి రెండో వారంలో మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ స్నద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ మినీ వేలంపై ఈ నెల 24న జరిగే మినీ వేలంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.






