టీమ్ ఇండియా వరల్డ్ కప్ జెర్సీ విడుదల

86
MPL

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే టీమ్ ఇండియా కోసం బీసీసీఐ కొత్త జెర్సీని విడుదల చేసింది. ‘బిలియన్ చీర్స్ జెర్సీ’ పేరుతో ఈ జెర్సీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. డార్క్ బ్లూ కలర్ జెర్సీపై అనేక ప్యాట్రన్లను ముద్రించింది. ఆ ప్యాట్రన్లు కోట్లాది మంది భారత క్రికెట్ ఫ్యాన్స్ వాయిస్‌లుగా బీసీసీఐ పోల్చింది. టీమ్ ఇండియా అఫీషియల్ జెర్సీ స్పాన్సర్ ఎంపీఎల్ లోగో కుడివైపు పైన ముద్రించింది. ఎడమ వైపు బీసీసీఐ లోగో.. దానిపైన మూడు స్టార్స్‌ను ఏర్పాటు చేశారు. టీమ్ ఇండియా గెలిచిన మూడు వరల్డ్ కప్‌లకు గుర్తుగా ఈ స్టార్స్ ఉంచారు.

ఇక మధ్యలో టీమ్ ఇండియా స్పాన్సర్ ‘బైజూస్’ లోగో.. దానికింద ఇండియా అనే అక్షరాలు ముద్రించారు. ‘బిలియన్ చీర్స్ జెర్సీ’గా పేర్కొన్న ఈ జెర్సీని ఎంపీఎల్ రూపొందించింది. జెర్సీ ఓపెనింగ్ ఫొటోలో కెప్టెన్ విరాట్ కోహ్లీ. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రాలు న్యూలుక్‌తో కనిపిస్తున్నారు. ఈ ప్యాట్రన్ జెర్సీతోనే ఈ ఏడాది చివరి వరకు టీమ్ ఇండియా మ్యాచ్‌లు ఆడనున్నది. టీమ్ ఇండియా అక్టోబర్‌ 24న పాకిస్తాన్‌తో, అక్టోబర్‌ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్‌ 3న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..