- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత జట్టుకు రూ.5 కోట్ల నజరానా
<p>దిశ,వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాను ఆ దేశ సొంత గడ్డపై ఓడించి భారత జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం నేపథ్యంలో భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనికి తోడు బీసీసీఐ భారత జట్టుపై కాసుల వర్షం కురిపించింది. అద్బుత ఆట తీరు కనబరిచి బోర్డర్-గవాస్కర్ ట్రోపిని కైవసం చేసుకున్న భారత్ జట్టుకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ తన ట్విట్టర్ అధికారిక ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదో […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాను ఆ దేశ సొంత గడ్డపై ఓడించి భారత జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం నేపథ్యంలో భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనికి తోడు బీసీసీఐ భారత జట్టుపై కాసుల వర్షం కురిపించింది. అద్బుత ఆట తీరు కనబరిచి బోర్డర్-గవాస్కర్ ట్రోపిని కైవసం చేసుకున్న భారత్ జట్టుకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ తన ట్విట్టర్ అధికారిక ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇదో అపూర్వ విజయమని, అస్ట్రేలియా గడ్డపై టీమిండియా నమోదు చేసిన ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కొనియాడారు. సిరీస్‌లో భారత జట్టు ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరును కనబరచారని అన్నారు. బీసీసీఐ తరఫున భారత జట్టుకు 5 కోట్ల రూపాయల బోనస్‌ను ప్రకటిస్తున్నట్టు చెప్పారు.
Next Story






