టెండర్ల గడువు పెంచిన బీసీసీఐ

75
IPL

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ కొత్త జట్ల కోసం టెండర్ల డాక్యుమెంట్లు కొనే గడువును బీసీసీఐ మరోసారి పెంచింది. గతంలో ఐటీటీ డాక్యుమెంట్ కొనుగోలుకు అక్టోబర్ 10 వరకు గడువు ఇచ్చింది. తాజాగా ఆ గడువును అక్టోబర్ 20 వరకు పెంచింది. కాగా, ఐపీఎల్ 2022లో రాబోయే కొత్త జట్లకు సంబంధించిన టెండర్లను అక్టోబర్ 25న తెరవనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే టెండర్లలో పాల్గొనే సంస్థలు/కన్సార్టియంలో తప్పకుండా ఐటీటీని కొనుగోలు చేయాలి. ఈ నెల 20 లోపు రూ. 10 లక్షలు చెల్లించి ఈ డాక్యుమెంట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొత్త జట్ల కనీస ధర రూ. 2000 కోట్లగా బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఈ సారి కొత్త జట్ల కోసం భారీ పోటీ నెలకొనడంతో ఈ ధర రూ. 3500 వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అహ్మదాబాద్, లక్నో, పూణే కేంద్రలుగా కొత్త జట్లకు టెండర్లు పిలవగా.. అహ్మదాబాద్, లక్నో కేంద్రంగా జట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..