సీఎం వైఎస్ జగన్‌ను సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం నేతలు

89
BC welfare

దిశ, ఏపీ బ్యూరో: బీసీ జనగణనపై శాసనసభలో తీర్మానం చేసినందుకు బీసీ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర రావుతోపాటు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ జనగణనపై శాసనసభలో తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల ప్రతినిధులు సీఎం వైయస్‌ జగన్‌ను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి ఆంజనేయులు, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి హనుమంతరావు, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే క్రాంతికుమార్, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, ఆర్ రమేష్ యాదవ్‌, ఎమ్మెల్యే జోగి రమేష్, ఆప్కో ఛైర్మన్‌ చిల్లపల్లి వెంకట నాగ మోహన్‌రావులు ఉన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..