- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరీంనగర్ వేదికగా బీసీల గర్జన.. ఈనెల 26న బీసీ సమ్మేళనం
<p>దిశ, తెలంగాణ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో ఈనెల 26వ తేదీన బీసీ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ యువ నేత మంద అమర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దేశ నిర్మాణంలో ఎనలేని సేవలు చేసి, గుర్తింపునకు నోచుకోని బీసీల సంక్షేమమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో బీసీలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకుండా, ఆయా వర్గాల […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో ఈనెల 26వ తేదీన బీసీ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ యువ నేత మంద అమర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దేశ నిర్మాణంలో ఎనలేని సేవలు చేసి, గుర్తింపునకు నోచుకోని బీసీల సంక్షేమమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో బీసీలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకుండా, ఆయా వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటివో జనాభా లెక్కల ప్రకారం బీసీల స్థితిగతులను అంచనా వేస్తోందని, ప్రస్తుత పరిస్థితులను సమీక్షించడానికి బీసీ జనగణన చేయాలని డిమాండ్‌చేశారు. బీసీ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ర్ట కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తోపాటు, రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, రాష్ట్ర కోఆర్డినేటర్లు దేవోళ్ల గంగాధర్, సదుర్ల మల్లేశం పాల్గొంటారని తెలిపారు.






