- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో బతుకమ్మ టీవీ నిర్వాహకురాలు కల్పన కన్నుమూత..
by Shyam |
<p>దిశ, కుత్బుల్లాపూర్ : కరోనా మహమ్మారి సీనియర్ పాత్రికేయురాలు, టీవీ నిర్వాహకురాలిని బలిగొంది. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన కొల్ల వెంకట కల్పన(40) పెద్ద కొన్ని సంవత్సరాలుగా పాత్రికేయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితం బతుకమ్మ టీవీ ఛానెల్‌ను స్థాపించారు. అయితే ఈ నెల 16వ తేదీన ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో సుచిత్రలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో నగరంలోని ఓ ప్రముఖ […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్ : కరోనా మహమ్మారి సీనియర్ పాత్రికేయురాలు, టీవీ నిర్వాహకురాలిని బలిగొంది. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన కొల్ల వెంకట కల్పన(40) పెద్ద కొన్ని సంవత్సరాలుగా పాత్రికేయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితం బతుకమ్మ టీవీ ఛానెల్‌ను స్థాపించారు. అయితే ఈ నెల 16వ తేదీన ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో సుచిత్రలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో నగరంలోని ఓ ప్రముఖ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 8 గంటల తర్వాత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.
Next Story






