మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీక బతుకమ్మ : కలెక్టర్ హరీష్

by  |
Batukamma celebrations
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. ఆడబిడ్డల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఎంతో ఆనందకరమని తెలిపారు. ట్రెసా ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని మహిళా ఉద్యోగులు తదితరులు బతుకమ్మ పాటలు పాడుతూ పాటలకు లయబద్దంగా బతుకమ్మ ఆటలను ఆడారు. అదే ఉత్సాహంతో జిల్లా కలెక్టర్​హరీష్ సైతం వారితో కలిసి కొద్దిసేపు బతుకమ్మ ఆటను ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.

Medical-Collectorate

ఈ సందర్భంగా కలెక్టర్​హరీశ్​మాట్లాడుతూ… మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండగను తెలంగాణ రాష్ట్రం ఎంతో వైభవంగా నిర్వహిస్తోందని ఇది ఆడపడుచులకు ఇచ్చే గౌరవమని అన్నారు. మహిళలు ఎంతో భక్తితో ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను జరుపుకుంటారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు రవి, మల్లయ్య, ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్, తహసీల్దార్లు, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed