- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోహాలో బతుకమ్మ, దసరా పండుగ సంబరాలు
<p>దిశ, వెబ్ డెస్క్: దోహాలో తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ -దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత రాయబారి కార్యాలయ కార్యదర్శి పద్మ కర్రీ, ఐసీబీఫ్ అధ్యక్షుడు జాయిద్ ఉస్మాన్, ఐసీసీ ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్, ఐసీసీ సలహాదారుల కమిటీ చైర్మన్ కె ఎస్ ప్రసాద్, ఐసీబీఫ్ కమిటీ సభ్యురాలు రజినీ మూర్తి, తెలంగాణ ప్రజా సమితి అడ్వైజరీ కమిటీ చైర్మన్ చెనవేణి తిరుపతి, చెన్న ప్రత్యూష, వేణుగోపాల్ పడకంటి, ధర్మరాజు యాదవ్ […]</p>

దిశ, వెబ్ డెస్క్: దోహాలో తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ -దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత రాయబారి కార్యాలయ కార్యదర్శి పద్మ కర్రీ, ఐసీబీఫ్ అధ్యక్షుడు జాయిద్ ఉస్మాన్, ఐసీసీ ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్, ఐసీసీ సలహాదారుల కమిటీ చైర్మన్ కె ఎస్ ప్రసాద్, ఐసీబీఫ్ కమిటీ సభ్యురాలు రజినీ మూర్తి, తెలంగాణ ప్రజా సమితి అడ్వైజరీ కమిటీ చైర్మన్ చెనవేణి తిరుపతి, చెన్న ప్రత్యూష, వేణుగోపాల్ పడకంటి, ధర్మరాజు యాదవ్ పంచిత, సురేందర్ నామాల, వెంకటేశ్ పొట్ట, ఖతర్ లోని ఇతర తెలుగు సంఘాల నాయకులు హాజరై వేడుకలను తిలకించారు.

తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్ అధ్యక్షతన స్థానిక లయోలా స్కూల్ వేదికగా ఈ వేడుకలను నిర్వహించారు. స్థానిక మహిళలు, పిల్లలు తమ తమ ప్రతిభను వేదికపై ప్రదర్శించి ఎంతగానో అలరించారు. అనంతరం బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడిపారు. ఆకట్టుకునేవిధంగా బతుకమ్మలు పేర్చిన వారికి బహుమతి ప్రదానం చేశారు. అనంతరం దసరా పండుగను జరుపుకున్నారు.







