కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు.

47

దిశ,వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. సాగు చట్టాలను ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. విద్యుత్ చట్టాలపై చేసినట్లే సాగు చట్టాలపై కూడా వ్యతిరేక తీర్మానం చేయాలని చెప్పారు. సాగు చట్టాలను సీఎం కేసీఆర్ ముందు వ్యతిరేకించారని తెలిపారు. ఢిల్లీకి వెళ్లి వచ్చాక సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని వివరించారు. కేసీఆర్ నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కేసీఆర్ తన వ్యక్తిగత అవసరాల కోసం రైతుల భవిష్యత్తును తాకట్టు పెట్టారని చెప్పారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..