ప్రపంచంలోనే గొప్ప పండుగ బతుకమ్మ

by  |
ప్రపంచంలోనే గొప్ప పండుగ బతుకమ్మ
X

దిశ,సిద్దిపేట: ప్రపంచంలోనే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అనీ, ప్రకృతిని దైవంలా పూజించే పండుగ బతుకమ్మ అని శాస్త్రీయంగా కూడా రుజువైందనీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలోని బతుకమ్మ సంస్కృతిని విదేశాల్లో చాటి చెబుతున్న ఎన్ఆర్ఐలను మంత్రి హరీశ్ రావు అభినందించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులతో జూమ్ మీటింగ్ లో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. విదేశాల్లో ఉన్న పిల్లలకు సైతం తెలంగాణ బతుకమ్మ సంస్కృతిని, సంప్రదాయాలను నేర్పుతున్న తల్లిదండ్రులకు ఈ సందర్బంగా అభినందనలను ఆయన తెలిపారు. ప్రస్తుత కరోనా సమయంలోనూ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను గొప్పగా జరుపుకుంటున్నారని తెలిపారు. విదేశాల్లో ఉన్నవారు కూడా బతుకమ్మ, దసరా పండుగలు గొప్పగా జరుపుకోవడం. అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు, ఆడ పడుచులందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలను తెలిపారు.



Next Story

Most Viewed