రీసైకిల్డ్ సముద్ర ప్లాస్టిక్‌తో ‘బార్బీ బొమ్మ’లు!

27
Barbie first doll

దిశ, ఫీచర్స్ : పిల్లల నుంచి పెద్దల వరకు ‘బార్బీ డాల్’ను అందరూ ఇష్టపడుతుంటారు. ఈ మేరకు ఆరు దశాబ్దాల నుంచి ప్రతీ తరాన్ని ఆకట్టుకుంటూ బొమ్మల్లో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటున్న ‘బార్బీ’ చిన్నారులను మురిపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ‘వ్యోమగామిగా, ఫైర్ ఫైటర్‌గా, గేమ్ డెవలపర్‌గా, అమెరికా ప్రెసిడెంట్‌గా’.. ఇలా ఎన్నో రూపాల్లో కనువిందు చేసింది. శరీర రంగులు ముఖ్యం కాదంటూ సమానత్వాన్ని తెలిపేలా వివిధ శారీరక ఆకృతులు, సరికొత్త హెయిర్ స్టైల్స్‌తో ఏడు రకాల బొమ్మలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో దివ్యాంగుల కోసం కూడా ‘వీల్ చెయిర్’ బార్బీ మార్కెట్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇలా బార్బీ మేకర్స్ ఎప్పటికప్పుడు కొత్త బొమ్మలను ప్రవేశ పెడుతుండగా.. తాజాగా ఓషియన్-బౌండ్ ప్లాస్టిక్‌తో రీసైకిల్ చేసిన సరికొత్త డాల్స్‌ను విడుదల చేసింది మాట్టెల్(అమెరికన్ బొమ్మల సంస్థ).

‘ప్లాస్టిక్’ వల్ల సముద్రాలు కలుషితమై, జలచరాలు ముప్పును ఎదుర్కొంటున్నాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బార్బీ తయారీ సంస్థ మాట్టెల్.. సమస్యను కొంతమేర తగ్గించాలనే ఆలోచనతో ‘బార్బీ’ బొమ్మలను రూపొందిస్తోంది. ఈ మేరకు మేకర్స్.. 90 శాతం రీసైకిల్ చేసిన ఓషియన్-బౌండ్ ప్లాస్టిక్ భాగాల నుంచి కొత్త రకం బొమ్మలకు రూపమిచ్చారు. ‘బార్బీ లవ్స్ ది ఓషన్’ అని పిలిచే ఈ బొమ్మలను మూడు రకాలుగా మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. వీటి ధరలు $ 9.99 (రూ. 730) – 99 19.99 (రూ. 1,460.81) మధ్య ఉండగా.. 1959లో మొదటిసారి ‘రూత్ హ్యాండ్లర్’ సంస్థ ఈ బార్బీ బొమ్మలను సృష్టించింది.

2030 నాటికి అన్ని ఉత్పత్తుల్లో 100 శాతం రీసైకిల్ లేదా బయో-బేస్డ్ ప్లాస్టిక్ పదార్థాలను ఉపయోగించాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోంది. పెరుగుతున్న ప్రయోజన-ఆధారిత బార్బీ పోర్ట్‌ఫోలియోకు అదనంగా ఈ కొత్త బార్బీ డాల్ ఉంటుంది. వినియోగదారుల్లో పర్యావరణ స్పృహను ఈ బొమ్మలు ప్రేరేపిస్తాయని భావిస్తున్నాం. తర్వాతి తరానికి ఆదర్శమైన భావాలను అందించే ఉద్దేశంతో ఈ ప్రయోగం చేశాం. 2021 చివరి నాటికి ప్యాకేజింగ్‌లో ఉపయోగించే కాగితం, కలప ఫైబర్ పదార్థాలను 95 శాతం రీసైకిల్ లేదా ఎఫ్‌ఎస్‌సీ-ధృవీకరించిన కంటెంట్‌‌తో రీప్లేస్ చేసే విధంగా ముందుకు సాగుతున్నాం.
– రిచర్డ్ డిక్సన్, మాట్టెల్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..