మ్యూజిక్ లెజెండ్ బప్పీలహరికి కరోనా పాజిటివ్.. ఐసీయూలో చికిత్స

by  |
Bappi Lahiri
X

దిశ, సినిమా: మ్యూజిక్ లెజెండ్ బప్పీలహరికి కరోనా పాజిటివ్ అని ఆయన కుమారుడు బప్ప ప్రకటించాడు. ప్రస్తుతం ఆయన బాంబే బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. బప్పీలహరి హెల్త్ స్టేబుల్‌గా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడగా, అందుకు చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బప్పీలహరి త్వరగా కోలుకొని తన మ్యూజిక్ మ్యాజిక్‌తో మళ్లీ అలరించాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కొవిడ్ విజృంభణ భయానకంగా మారిందని, ప్రతీ ఒక్కరు మాస్కు ధరించాలని అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని బప్పీలహరి కుమారుడు సూచించారు.

Next Story