మాది దళిత ప్రభుత్వం : ఎంపీ సురేశ్

47

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అమరావతి రైతులకు బేడీలు వేశారంటున్నారు, మూడు రాజధానులకు మద్దతు ఇచ్చిన వారిపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు దిగిన వారిని రైతులంటూ నానా యాగీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దళితులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. మాది దళిత ప్రభుత్వం అని, దళితులను అడ్డుపెట్టుకుని ఏదో చేయాలని చూడొద్దని సూచించారు.