రూ.56లక్షల విలువైన గుట్కాబ్యాగుల పట్టివేత

by  |
రూ.56లక్షల విలువైన గుట్కాబ్యాగుల పట్టివేత
X

దిశ , కరీంనగర్ : గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్న గుట్కా రాకెట్‌ను బుధవారం కరీంనగర్ పోలీసులు ఛేదించారు. బీదర్ కేంద్రంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నిషేధిత గుట్కాను తరలించి విక్రయిస్తున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ వ్యవహారం నడిపిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి, రెండు వాహనాలు, రూ.56 లక్షల 25 వేల విలువైన గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్టు సీపీ విబీ కమలాసన్ రెడ్డి తెలిపారు.వివరాల్లోకివెళితే..కర్నాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి అక్రమంగా ఉమ్మడి కరీంనగర్‌కు గుట్కాను తరలించి, రిటేల్ వ్యాపారులకు సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నామన్నారు. విచారణలో భాగంగా కర్నాటకలో గుట్కాపై నిషేధం లేనందున ఇక్కడి వ్యాపారులు ఎవరికీ తెలియకుండా జిల్లాకు గుట్కాకు తీసుకువచ్చి కిరణా షాపులకు అమ్ముతున్నట్టు అంగీకరించారన్నారు. దీనిపై పక్కా ప్రణాళిక రచించి ఈ దందాను బ్రేక్ చేశామని సీపీ తెలిపారు.ఈ ఆపరేషన్‌లో టాస్క్ ఫోర్స్, సివిల్ పోలీస్ జాయింట్‌గా పాల్గొన్నట్టు ఆయన వివరించారు.గుట్కా దందాలో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదని, కరీంనగర్ కమిషనరేట్‌లో ఎవరైనా క్రయ విక్రయాలు జరిపినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఇంత భారీ ఎత్తున గుట్కాను సీజ్ చేసిన ఘటనలు నమోదు కాలేదన్నారు.ఈ కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించిన టాస్క్ ఫోర్స్, సివిల్ పోలీసులను సీపీ అభినందించారు.


Next Story

Most Viewed