బ్యాడ్‌బ్యాంకుకు మోసపూరిత రుణాలు అమ్మేందుకు సిద్ధమైన బ్యాంకులు!

by  |
bank
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ఇటీవల ప్రారంభించిన నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(ఎన్ఏఆర్‌సీఎల్) లేదా బ్యాడ్‌బ్యాంకుకు పలు బ్యాంకులు తమ మోసపూరిత రుణాలను విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి. దాదాపు రూ. లక్ష కోట్ల మోసపూరిత రుణాలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాయని, దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అనుమతి కోసం వేచి ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం గత మూడేళ్లలో బ్యాంకులు రూ .3.95 లక్షల కోట్ల విలువైన మోసపూరిత రుణాలను ప్రకటించాయి.

ఈ మొత్తం బ్యాడ్‌బ్యాంకు కోసం రూ. 2 లక్షల కోట్ల రుణాలను పొందాలనే లక్ష్యానికి దోహదపడుతుందని అంచనా. ఇప్పటికే వివిధ బ్యాంకులు, అసెట్ మేనేజర్లు మోసపూరిత రుణాలను బ్యాడ్‌బ్యాంకుకు అమ్ముకునే అంశానికి ఆమోదం ఇవ్వాలని ఆర్‌బీఐని కోరాయి. ఇప్పటికే రూ. 89 వేల కోట్ల రుణాలను గుర్తించినట్టు సమాచారం. కాగా, బ్యాడ్‌బ్యాంకు జారీ చేసే సెక్యూరిటీ రసీదుల కోసం రూ.30,600 కోట్ల వరకు ప్రభుత్వ గ్యారెంటీని ఆమోదించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed