రుణ రేట్లను తగ్గించిన బ్యాంక్ ఆఫ్ బరోడా!

by  |
Bank of Baroda
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ బ్యాంకులు ఇటీవల పోటీపడి మరీ గృహ రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఇతర బ్యాంకులతో పోటీ పడి మరీ రుణాల రేట్లను తగ్గింపు ప్రకటనలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు గృహ రుణాల వడ్డీ రేట్లను తగ్గించగా, ఈ జాబితాలో దేశీయ మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) కూడా చేరింది. బీఓబీ తాజాగా రెపో లింక్డ్ లెండింగ్ రుణ రేట్లను 6.85 శాతం నుంచి 6.75 శాతానికి 10 బేసిస్ పాయింట్లను తగ్గించింది.

ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంకు వెల్లడించింది. మార్చిన రుణ రేట్ల నేపథ్యంలో గృహ రుణాలు 6.75 శాతం నుంచి లభిస్తాయని, వాహన రుణాలు 7 శాతం నుంచి అందనున్నట్టు బ్యాంకు తెలిపింది. అలాగే, తనఖా రుణ రేట్లు 7.95 శాతం, ఎడ్యుకేషన్ రుణాలు 6.75 శాతం నుంచి ప్రారంభమవుతాయని బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. రుణాల రేట్లలో తగ్గింపు ద్వారా వినియోగదారులు తమ బ్యాంకు నుంచి మరింత సరసమైన రుణాలను అందుకుంటారు. డిజిటల్ ప్రక్రియ ద్వారా ఈ రుణాలను పొందేందుకు మరింత సులభతరం అవుతుంది. మరింత మందికి రుణాలను అందించేందుకు వీలవుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా తనఖా, రిటైల్ ఆస్తుల విభాగం జనరల్ మేనేజర్ హర్షద్ కుమార్ సోలంకి వెల్లడించారు.


Next Story

Most Viewed