ఆమె పై కేసు పెట్టండి

70

దిశ, వెబ్‌డెస్క్: ముంబై‌ నగరాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చిన కంగనా రనౌత్‌ పై కేసు పెట్టాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం పై కంగనా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. ముంబై ని పీవోకేతో పోల్చుతూ ఓ ట్వీట్ చేసింది. ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారడంతో ఆమె పై శివసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే వ్యవహారం పై స్థానిక వ్యక్తి కేసు వేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.