‘పవనన్న సంగతి సరే.. బండ్లన్నా నీ హెల్త్ ఎలా ఉంది?’

155

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. పవన్ ‘గెట్ వెల్ సూన్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం తన ఫాంహౌస్‌లోనే హోం ఐసోలేషన్‌లో పవన్ చికిత్స పొందుతుండగా.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటూ జనసేన ట్విట్టర్‌లో పేర్కొంది.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కు కరోనా సోకడంపై ఆయన వీరాభిమాని, నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్‌లో స్పందించాడు. ‘ఐ లవ్ యూ బాస్.. దేవుడు ఎప్పుడూ మాతోనే’ అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. కాగా ఇటీవలే బండ్ల గణేష్ రెండోసారి కరోనా బారిన పడటంతో.. ప్రస్తుతం అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. దీంతో ‘అన్నా నీ హెల్త్ ఎలా ఉంది’ అంటూ పవన్ ఫ్యాన్స్ బండ్ల ట్వీట్‌కు రిప్లైలు ఇస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..