- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ప్లీజ్ సేవ్ తెలుగు గర్ల్’.. బండ్ల గణేశ్ ట్వీట్..
<p>దిశ, వెబ్‌డెస్క్: ‘ప్లీజ్ సేవ్ తెలుగు గర్ల్’ పేరుతో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. పని కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ తెలుగు అమ్మాయి పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టేలా ఉన్న ఓ వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. https://twitter.com/ganeshbandla/status/1298297321696837633?s=20 ‘ఎలాగైనా ఆ అమ్మాయిని కాపాడాలని కోరుతూ, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, రాష్ట్ర డీజీపీ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ‘ప్లీజ్ సేవ్ తెలుగు గర్ల్’ పేరుతో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. పని కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ తెలుగు అమ్మాయి పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టేలా ఉన్న ఓ వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
https://twitter.com/ganeshbandla/status/1298297321696837633?s=20
‘ఎలాగైనా ఆ అమ్మాయిని కాపాడాలని కోరుతూ, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్లకు’ ట్యాగ్ చేశాడు.
గల్ఫ్ కంట్రీలో ఉంటున్న దుర్గా రావు అనే తెలుగు వ్యక్తి ఆ వీడియోను బండ్ల గణేశ్‌కు షేర్ చేయగా, ఆయన రెండు రాష్ట్రాల సీఎంలు, మంత్రి కేటీఆర్, తెలంగాణ డీజీపీకి షేర్ చేశారు. ఈ వీడియాలో తెలుగు అమ్మాయిని ఓ మహిళా విచక్షణా రహితరంగా కర్రతో కొడుతున్న దృశ్యాలు, దెబ్బలు తాళలేక బాధితురాలు పెడుతున్న ఆర్తనాదాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. కాగా, వీడియోపై తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.






