- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. కేసీఆర్‌కు ‘బండి’ హెచ్చరిక
by Shyam |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రజల ఆకాంక్షల సాధన కోసం పోరాటాలు చేస్తున్నది కేవలం బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన బీజేపీ సమరభేరీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిగ్గుండాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సునీల్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కుటుంబానికి డెడ్ బాడీని అప్పగించలేదని ఆరోపించారు. 5 సంవత్సరాల నుండి […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రజల ఆకాంక్షల సాధన కోసం పోరాటాలు చేస్తున్నది కేవలం బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన బీజేపీ సమరభేరీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిగ్గుండాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సునీల్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కుటుంబానికి డెడ్ బాడీని అప్పగించలేదని ఆరోపించారు. 5 సంవత్సరాల నుండి నోటిఫికేషన్ ఇవ్వలేదని కలత చెంది సూసైడ్ చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో వెల్లడించారన్నారు. సునీల్ నాయక్ సెల్ఫీ వీడియోను మరణ వాంగ్మూలంగా తీసుకుని సీఎం కేసీఆర్ సర్కార్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను బయటకు గుంజుకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బండి సంజయ్ హెచ్చరించారు.
Next Story






