- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ‘‘బండి’’
by Shyam |
<p>తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న పార్టీ కార్యాలయంలో పూజలు నిర్వహించి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీ వివేక్, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని మొదట భావించినప్పటికీ, అధ్యక్షుడిగా పార్టీ పరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావడంతో నేడు బాధ్యతలు స్వీకరించారు. […]</p>

X
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న పార్టీ కార్యాలయంలో పూజలు నిర్వహించి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీ వివేక్, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని మొదట భావించినప్పటికీ, అధ్యక్షుడిగా పార్టీ పరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావడంతో నేడు బాధ్యతలు స్వీకరించారు. కాగా, మార్చి10న బండి సంజయ్‌ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Tags: bandi sanjay, bjp, telangana, president, took charge
Next Story






