గంప గోవర్ధన్ కామెంట్స్ పై అక్కడ మాట్లాడతా- బండి

126

దిశ, కామారెడ్డి: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేసిన కామెంట్స్ పై కామారెడ్డికి పాదయాత్రకు  వచ్చినప్పుడు మాట్లాడతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిర్మల్ జిల్లాలో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేక బస్సులో వెళ్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆగిన ఆయన జీవధాన్ చౌరస్తా వద్ద గల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గురువారం  నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేసిన కామెంట్స్ పై బండి సంజయ్ స్పందన కోరగా.. తాను ఇప్పుడేమి మాట్లాడలేను అని, కామెంట్స్ పై కామారెడ్డికి పాదయాత్రకు వచ్చినప్పుడు మాట్లాడతానని ప్రస్తుతం నిర్మల్ సభకు వెళ్లాల్సి ఉందని తెలిపారు. ఆయన వెంట ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, జిల్లా నాయకులు ఉన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..