టీఆర్ఎస్ పతనం.. కేసీఆర్ బయటకు రావాలి: బండి సంజయ్

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల వీరోచిత పోరాటమే ఈ విజయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీలో అన్ని ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన ఎస్‌ఈసీ, బీజేపీ కార్యకర్తలపై దాడులను అడ్డుకోలేని డీజీపీలకు ఈ విజయం అంకితమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా గడీ నుంచి [&hellip;]</p>

టీఆర్ఎస్ పతనం.. కేసీఆర్ బయటకు రావాలి: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల వీరోచిత పోరాటమే ఈ విజయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీలో అన్ని ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన ఎస్‌ఈసీ, బీజేపీ కార్యకర్తలపై దాడులను అడ్డుకోలేని డీజీపీలకు ఈ విజయం అంకితమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా గడీ నుంచి బయటకు రావాలని బండి సంజయ్ చురకలు వేశారు. టీఆర్ఎస్ పతనం, కౌంట్‌డౌన్ ప్రారంభమైందని బండి హెచ్చరికలు చేశారు.

Next Story