ప్రభుత్వానికి పసిపిల్లల ఉసురు తాకుతుంది- బండి సంజయ్

by Shyam |   (  Updated:2021-09-12 23:31:05  IST  )

<p>దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల చిన్నారిని హత్యాచారం చేసిన ఘటనపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ట్విట్టర్లో స్పందించారు. ఆయన ట్వీట్ ప్రకారం.. &#8220;హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం హేయమైనది. ఈ దురాగతానికి ఒడిగట్టిన నిందితుడిని అత్యంత కఠినంగా శిక్షించాలి. టీఆర్ఎస్ పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు రోజురోజుకు ఎక్కువైపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదాయం కోసం మద్యాన్ని ఏరులై పారిస్తూ [&hellip;]</p>

ప్రభుత్వానికి పసిపిల్లల ఉసురు తాకుతుంది-  బండి సంజయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల చిన్నారిని హత్యాచారం చేసిన ఘటనపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ట్విట్టర్లో స్పందించారు. ఆయన ట్వీట్ ప్రకారం.. “హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం హేయమైనది. ఈ దురాగతానికి ఒడిగట్టిన నిందితుడిని అత్యంత కఠినంగా శిక్షించాలి. టీఆర్ఎస్ పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు రోజురోజుకు ఎక్కువైపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదాయం కోసం మద్యాన్ని ఏరులై పారిస్తూ యువకులను మద్యానికి బానిసలుగా చేస్తున్నారు. మద్యం తాగిన మత్తులో విచక్షణ కోల్పోయి పసిపిల్లలపైన అత్యాచారాలు చేస్తుండటం దారుణం. ఈ దారుణానికి ప్రభుత్వ వైఫల్యాలే కారణం. ప్రభుత్వానికి పసిపిల్లల ఉసురు తగలక మానదు.” అని అన్నారు.

Next Story