- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హుజూరాబాద్ కోసం ఏపీ-తెలంగాణ మధ్య చిచ్చు’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ ఏపీకి నీళ్లు అమ్మేసి రాష్ట్రానికి ద్రోహం చేశారంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. మంగళవారం పార్టీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన.. కృష్ణా జలాలపై ఇద్దరు సీఎంలు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులపై కేసీఆర్, జగన్ మధ్య అంతర్గత ఒప్పందాలు చేసుకున్నారని చెప్పుకొచ్చారు. 2015లో ఏపీ-తెలంగాణ మధ్య నీటి కేటాయింపులు జరిగాయని బండి సంజయ్ గుర్తు చేశారు. అదే సమయంలో తెలంగాణకు 34, ఏపీకి 66 శాతం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ ఏపీకి నీళ్లు అమ్మేసి రాష్ట్రానికి ద్రోహం చేశారంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. మంగళవారం పార్టీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన.. కృష్ణా జలాలపై ఇద్దరు సీఎంలు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులపై కేసీఆర్, జగన్ మధ్య అంతర్గత ఒప్పందాలు చేసుకున్నారని చెప్పుకొచ్చారు. 2015లో ఏపీ-తెలంగాణ మధ్య నీటి కేటాయింపులు జరిగాయని బండి సంజయ్ గుర్తు చేశారు. అదే సమయంలో తెలంగాణకు 34, ఏపీకి 66 శాతం అంగీకారం తెలుపడమే కాకుండా.. రాష్ట్రానికి 299 టీఎంసీలు ఇస్తామంటే కేసీఆర్ ఒప్పుకున్నారని చెప్పారు. కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే ప్రజలను రెచ్చగొడుతున్నారని.. మళ్లీ రెండు రాష్ట్రల మధ్యల చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
Next Story






