- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి భగీరథ్ కేసు, అరెస్ట్ కేంద్రానికి సంబంధం లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్టు అయ్యాడని, అంశంపై ఈ సమయంలో చర్చించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్టు అయ్యాడని, అంశంపై ఈ సమయంలో చర్చించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసుతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. పూర్తిగా రాష్ట్ర పోలీసులే ఈ వ్యవహారాన్ని చూసుకుంటారని, విపక్షాలు విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చి మోసం చేసిందని, కనీసం రైతులు పండించిన ధాన్యం కొనలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తన నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం మీద, అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు కూలీలకు, కౌలు రైతులకు హామీ ఇచ్చి మోసం చేసింది.. లక్షల మంది రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో బ్యాంకుల్లో డీఫాల్టర్లుగా మారారు.. అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల విషయాలపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి, మంత్రులు ఎదురుదాడులపైనే దృష్టి పెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో సజావుగా కొనుగోళ్లు ఎందుకు చేయడం లేదో చెప్పలేని పరిస్థితి.. ఈసారి కూడా దిగుబడి పెరిగిందని దానికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టడం లేదన్నారు.
ధాన్యం కొనుగోలుకు ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క రూపాయి భారం కూడా పడదు. బస్తాలు, ట్రాన్స్ పోర్ట్, చెల్లించే డబ్బుకు రుణం, దానికి వడ్డీ, గోదాముల్లో పెట్టేందుకు అద్దె కేంద్రమే భరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు ఎందుకు ఆలస్యం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కేజీ బియ్యంపై కేంద్ర ప్రభుత్వం రూ.40 ఖర్చు చేస్తుంది. రైతులను ఆదుకుంటూనే 83 కోట్ల మంది ప్రజలకు 5 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా కేంద్రం పంపిణీ చేస్తోంది. ఈ ప్రభుత్వం ఫోజు కొడుతున్న సన్న బియ్యం పంపిణీలో కూడా 60 శాతం ఖర్చు కేంద్రానిదే ఇది కాదని రేవంత్ రెడ్డి చెప్పగలరా అని సవాల్ విసిరారు.
మంత్రులంతా ధాన్యం కొనుగోళ్లపై ఫోకస్పెట్టాలి..
రాష్ట్ర మంత్రులంతా ఒక్కో జిల్లాకు వెళ్లి కొనుగోళ్లపై దృష్టి పెట్టి రైతుల ఇబ్బందులు లేకుండా చూడాలని, హైదరాబాద్ ఏసీ గదుల్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టడం మానుకోవాలని సూచించారు. యూరియా 45 కేజీల బస్తా రూ. 242 రైతులకు అందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ప్రతి బస్తాకు రూ.2500 ఖర్చు చేస్తుందని, అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినా అనేక ఏండ్లుగా యూరియాపై ఒక్క రూపాయి పెంచకుండా రైతులకు కేంద్రం మేలు చేస్తున్నదని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి ఎస్ఐఆర్లో ఎన్నికల కమిషన్కు సహకరించాలి.. బూత్ లెవల్ ఆఫీసర్లపై సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకం లేదు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మతం పేరుతో రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం మీ ఓట్లు తొలగించాలని చూస్తోంది అంటూ స్వయంగా ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు.. కేరళ, తమిళనాడులో ఎస్ఐఆర్ జరిగితే బాగా జరిగినట్లు లెక్క అక్కడ బీజేపీ గెలవలేదు. బెంగాల్లో జరిగితే అక్కడ పొరపాటు జరిగినట్లు లెక్క.. ఎందుకంటే అక్కడ బీజేపీ గెలిచింది. ఇంత దారుణంగా ప్రభుత్వ అధికారులపై బురద చల్లి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదే ప్రచారం ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది.. అక్రమ ఓటును తొలగించకపోయినా, నిజమైన ఓటరును తొలగించే ప్రయత్నం చేసినా ఇదేంటని ప్రశ్నించే అధికారం బీఎల్ఏకు ఉంటుంది.. దిగజారి మాటలు ఎవరు మాట్లాడినా తాను స్పందించాల్సిన అవసరం లేదు.. వాళ్లు గెలిస్తే ఈవీఎంలు మంచివి. మిగతావారు గెలిస్తేనే ఈవీఎంలు మంచివి కానట్లు పరిస్థితి ఉందన్నారు.






